పక్షిరాజు యౌవ్వనంవలె
దినదినము శక్తిపొందెదం (2)
ప్రతిరోజూ నూతనమైన
మేలులతో తృప్తిపొందెదం (2)
యేసు కొరకు నిలిచెదమా
అపవాదిని గెలిచెదమా (2) ॥పక్షి॥
1. యుద్ధభూమిలో ప్రజలను నడుప
నాయకులుగా ఎదిగెదమా
సిలువ బాటలో జనులను నిలుప
యోధులుగా కదిలెదమా ॥యేసు॥
2. ద్రాక్షతోటలో పనిచేయుటకై
మన చేతులు కలిపెదమా
సాక్ష్యమిచ్చుచూ ప్రజలందరికీ
యేసువార్త తెలిపెదమా ॥యేసు॥