newjerusalemministries.com

నమ్మదగిన దేవుని వెంబడిరచిన

నమ్మకత్వము కలిగి జీవించిన

ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు

సాతాను నిన్ను ముట్టడు

1. యోసేపును ఆపదలో రక్షించెను

ఫలియించెడి కొమ్మగా హెచ్చించెను

ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు.

తనతో రమ్మని నిన్ను

అడుగుచున్నాడు                              ॥నమ్మ॥

2. దావీదును రాజుగా

అభిషేకించెను

ప్రియమైన సేవకునిగా

రూపించెను

ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు.

తనతో రమ్మని నిన్ను

అడుగుచున్నాడు.                             ॥నమ్మ॥

3. మోషేను నాయకునిగా

నియమించెను తన ప్రజలకు

దీవెనకరముగా ఉంచెను

ఆ దేవుడే ఈనాడు ఉన్నాడు.

తనతో రమ్మని నిన్ను

అడుగుచున్నాడు                              ॥నమ్మ॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *