యెహోవా… సమూయేలూ సమూయేలూ, అని పిలువగా….. 13:10
1. సమూయేల్ వంటి చెవులను నాకు యిమ్ము ప్రభువా! (2)
దేవుని మెల్లని స్వరము వినెడి వరము నీయుమా (1)
నీయొక్క చిత్తము నిత్యము చేయను నేర్పు ప్రభువా! (1)
నమ్మకముగా లోబడి నడువ కృపనీయుమా! (1)
2. దానియేల్ వంటి ప్రార్ధనాత్మ యిమ్ము ప్రభువా!
అలసిపోక పోరాడి ప్రార్థించ వాంఛ నీయుమా!
తీర్మానముతో కీడున్ జయించ బలము నీయుమా!
కష్టము నష్టము మరణమొచ్చిన ధైర్యము నీయుమా!
3. యేసు నీవంటి నడుచు కాళ్లు యిమ్ము ప్రభువా!
యేసు నీవలె సహాయం చేయు చేతుల నీయుమా!
యేసు నీవంటి మెత్తని హృదయం యిమ్ము ప్రభువా
యేసు నీవంటి పవిత్ర జీవిత మిమ్ము ప్రభువా