….(ప్రభువునకు) ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను… కొలొస్స 1:11
పల్లవి : సంపూర్ణ జ్ఞానము కలిగి-ఆత్మఫలమునందు అభివృద్ధి నొందుడి(1)
సంపూర్ణ జ్ఞానము కలిగి (1)
1. క్రీస్తేసునందు మనకు పాప- క్షమాపణ కలిగెను (2)
అంధకార సంబంధమైన – అధికారమునుండి విడుదల దొరికె (2)
ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము (2)
నీవు ప్రేమను కలిగియుండుము (2) ॥సంపూర్ణ॥
2. ప్రభు యేసు అదృశ్యుండైన – దేవుని రూపము గలవాడు (2)
సర్వసృష్టికి కర్తయు తానె – నిన్ను నూతన సృష్టిగజేసె (2)
ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము (2)
నీవు ఎల్లప్పుడు ఆనందించుము (2) ॥సంపూర్ణ॥
3. మృతులలోనుండి మొదటలేచి – యున్నవాడు యేసుప్రభు (2)
మనలను తండ్రి రాజ్యమునకు – వారసులుగ జేసియున్నాడు (2)
ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము (2)
నీలో ఏలనియ్యుము – సమాధానము (2) ॥సంపూర్ణ॥
4. క్రీస్తేసు నందు సర్వ సంపూర్ణత – నిండి యున్నది (2)
సిలువ మరణము ద్వారానే మనల – తండ్రితో సమాధానపరచే (2)
ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము (2)
నీవు దీర్ఘ శాంతము కలిగియుండుము (2) ॥సంపూర్ణ॥
5. సమస్త సృష్టికి ప్రకటించబడిన – సువార్తను విడువక (2)
విశ్వాసమందు నిలిచిన యెడల – నీవా మహిమను పొందెదవు (2)
ప్రభు కన్ని విషయములలో – తగినట్టుగా నడచుకొనుము (2)
నీవు దయాళుత్వము కనుపరుచుము (2) ॥సంపూర్ణ॥
6. దైవ చిత్తమును సంపూర్ణ – ముగా గ్రహించినవారై (2)
సకల సత్కార్యంబులలో – ప్రభుని సంతోషపరచుచు (2)
ప్రభున కన్ని విషయములలో తగినట్టుగా నడుచుకొనుము (2)
మంచితనము సాత్వికము చూపుము (2) ॥సంపూర్ణ॥
7. దేవుని విషయమైన జ్ఞానమందు – అభివృద్ధి నొందుచు (2)
ఆయన శక్తితో బలపర్చ – బడి క్రీస్తేసులో సంపూర్ణులై (2)
ప్రభున కన్ని విషయములలో – తగినట్టుగా నడుచుకొనుము (2)
నీలో ఆశా నిగ్రహము నలవరచుము (2) ॥సంపూర్ణ॥