క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3
పల్లవి : విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని (2)
1. నిత్యజీవము చేపట్టి – సత్యవేదము చేబూని (2)
పవిత్ర హృదయములతో – పోరాడుడి విజయముతో (2) ॥విశ్వాస॥
2. నీతిని భక్తిని గోరి – నిజమైన విశ్వాసులుగా
ఓర్పును ప్రేమను గల్గి – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
3. ప్రథమ పాపినైన – నను ప్రేమించెను ప్రభువు
ప్రభు కనికరమును పొంది – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
4. అంధకార హృదయములను – అద్భుతముగ వెలిగించె
ప్రకాశించుచు ప్రభులో – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
5. ఆకాశమున నుండి – కలిగిన దర్శనమునకు
అవిధేయత చూపకను – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
6. అన్యజనుల మధ్య – భూరాజుల యెదుట (2)
క్రీస్తుని నామము భరించి – పోరాడుడి విజయముతో (2) ॥విశ్వాస॥
7. క్రీస్తేసు మనస్సు కలిగి – సత్రియలను జరిగించి
యోధులుగా నిలుచుండి – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
8. దీన మనస్సు కలిగి – పిల్లలారా లోబడియు
మహిమ కిరీటముకై – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥
9. ఆత్మల రక్షణ కొరకై – అర్పించుడి జీవితము
అంతము వరకు నిలిచి – పోరాడుడి విజయముతో ॥విశ్వాస॥