…యేసుక్రీస్తు అనుగ్రహించు… జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. 2 పేతురు 3:18
పల్లవి : యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా నా రక్షకుడా(1)
నీ ధర్మశాస్త్రము నాకు ప్రియము, నీ దివ్య వాక్యమే ఆహారము (2)
1. యెహోవా నియమించెను ధర్మశాస్త్రము
అది ఎంతో యధార్థమై యున్నది(2)
అది ప్రాణమును తెప్పరిల్లజేయున్
బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించున్(2) ॥యె॥
2. యెహోవా నీ ఉపదేశంబులు – నిర్దోషములు అయి యున్నవి (2)
నీ ధర్మమెంతో నిర్మలమైనది – అది కన్నులకెంతో వెలుగిచ్చును(2) ॥యె॥
3. నీ న్యాయ విధులు సత్యమైనవి – అవి ఎంతో నీతి న్యాయంబులు
నీయందు భయమెంతో పవిత్రము -అది నిత్యముగాను నిలుచునది॥యె॥
4.నీ శాసనము నమ్మదగియున్నది – సంతోషపరచును నాయుల్లము
బంగారు కంటే ప్రియమైనది – జుంటితేనే కంటే అతి మధురము॥యె॥