ప్రార్థన చేతును అనుదినము
దేవుని శక్తిని పొందెదను
యేసయ్యతో మాట్లాడెదను
తండ్రితో గడిపెదను
1. యేసు ప్రభువు ప్రార్ధించెను
సాతాను శోధన గెల్చెను
నేను కూడా ప్రార్ధన చేసి
సాతానుని ఓడించెదను
2. సంఘమంత ప్రార్ధించెను
చెరసాల పునాది కదిలెను
నేను కూడా ప్రార్ధన చేసి
పాపపు గోడలు కూల్చెదను