పెద్ద పెద్ద బోధలు నేను చేయను
విసిగించే మాటలు ప్రకటించను
యేసయ్య ప్రేమను క్రియలలోనే
జనులకు చూపింతును
1. అర్ధముకాని భాష మాట్లాడను
వ్యర్ధముగా వాక్యముచ్చరించను
యేసయ్య ప్రేమను క్రియలలోనే
జనులకు చూపింతును
2. మొక్కుబడి ప్రార్ధన నేను చేయను
చిక్కుతెచ్చు మాటలకు తావీయను
యేసయ్య ప్రేమను క్రియలలోనే
జనులకు చూపింతును