పిల్లలము మేమందరము
నిను స్తుతియింప వచ్చితిమి
ప్రభువా నీవే నీతిరాజ
ఘనత మహిమ చెల్లింతుము
1. మా పాపములను క్షమియించి
మాకొసగు ఆశీర్వాదం
సుందర మనోహర స్వర్గములో
మమ్ముల ప్రవేశింప చేయు ॥పిల్ల॥
2.వాక్యము ప్రార్ధన సేవలో
మా హృదయమును మార్చుము
మాదు కాళ్ళు చేతులు వాడుకొనుము నీ మహిమకై ॥పిల్ల॥