నా దోనెలో యేసుంటే
నడుపుతుంటే
నాకేమి భయము లేదుగా
చీకటులు కమ్ముకున్నా
చుట్టు అలలు ఉన్నా
ఏ అపాయము రాదుగా
1. సముద్రమును కలిగించిన
శక్తిగల దేవుడు
గాలిని గద్దిస్తాడుగా
తుఫాను ఆపేస్తాడుగా
సమస్యలను సరిచేసే
యేసుక్రీస్తు దేవుడు
నా దాకా రానీయడుగా
ఇబ్బంది పడనీయడుగా ॥నా॥
2. నా గమ్యం నియమించిన
పరలోక దేవుడు
మార్గము చూపిస్తాడుగా
సరిగా నడిపిస్తాడుగా
కునుకకుండా కాపాడి
తండ్రియైన దేవుడు
నన్ను రక్షిస్తాడుగా
సంతోషమిస్తాడుగా