…ఊరకుండుమని… చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. మార్కు 4:39
1. నాదు చిన్న హృదయము యేసు సదనము
అందులోన యేసుడు వసించుచుండును(2)
దుష్టుడు, దురాత్ముడు నన్ను పిలిచినా
యేసు ప్రభుని చూచి వాడు పారిపోవును(2)
2. నాదు చిన్న హృదయము నావ వంటిది
నాదు చిన్ని నావను యేసే నడుపును
భీకర తుఫానులు కదలివచ్చినా
యేసు ప్రభుని మాటతోడ నిమ్మళించును