newjerusalemministries.com

నీ కట్టడలను నేను గైకొందును… కీర్తన 119:8

పల్లవి : దైవాజ్ఞకు నీవు లోబడిన తన వాగ్దానము నెరవేర్చును (2)

1. అపవాదికి చోటియ్యక – దొంగతనములు చేయక(2)

    నీ పాపముల నొప్పుకొనిన – కడుగును క్రీస్తు రక్తముతో (2) ॥దైవా॥

2. వాక్యము ప్రార్థన – యందు నీవు గడిపిన

    ప్రభువు నీదు ప్రార్థన విని – నీకు విజయ మొసగును           ॥దైవా॥

3. నీవు యెహోవాను – నమ్మి మేలు చేయుము

    నీవును నీదు యింటివారును – యెహోవాను సేవించుడి         ॥దైవా॥

4. నీ ఆశ్రయము కోటయు – నీవు నమ్ము దేవుడు

    నీ హృదయము నుండి – జీవధారల – ప్రవహింపజేయును      ॥దైవా॥

5. పాపమును కప్పిన – ఆకానువలె నుండక

    రాహాబువలె నాధారపడుము – క్రీస్తుయేసు రక్తము పై       ॥దైవా॥

6. ధైర్యముగా నిలువుము – ఏలీయా వలె నీవును

    ప్రభు క్రీస్తును వెంబడించుము – ఓర్పుతో రూతును పోలియు ॥దైవా॥

7. నిన్ను ఏర్పరచెను – ఏలీషా వంటి సేవకై

    ఎదురుచూడుము పవిత్రముగా – రారాజు యొక్క రాకకై       ॥దైవా॥

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *