… దేవుడు తన… కుమారుని లోకములోనికి పంపెను;…1 యోహాను 4:9
1. దేవుడు తన పుత్రుని పంపె జగమునకు
సిలువలో మరణించెను రక్షింప మనలను
పల్లవి : ఏమిత్తున్ ! ఏమిత్తున్ ! యేసుకు నేమిత్తున్? (1)
ప్రభుని గొప్ప ప్రేమకై నేనేమివ్వగలన్ (2)
2. నావంటి గొర్రెపిల్ల పైన ప్రేమ జూపునా?
మరేమి యిచ్చినను – తానంగీకరించునా?
3. వాక్యంబును పఠించి దాని ననుసరించెద
ప్రార్థించుచు నెల్లప్పుడేసుతోనే నడిచెద