దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16
పల్లవి : దేవుండు ఈ పాపమయ – లోకమును ఎంతో ప్రేమించెను (1)
ఒక్కడైన తన ప్రియకుమారుని మన కొరకు అనుగ్రహించెన్ (1)
ఆయనపై విశ్వసించిన – నిశ్చయముగ నశింపవు (1)
నిత్య జీవము పొందెదవు – ప్రభువుతోనే సదా నుందువు (1)
1. పాపపు శిక్ష అగ్నిగుండమే – అయినను దేవుని వరము (2)
ప్రభువైన యేసునందు – పరలోకరాజ్యము పొందు (2) ॥దే॥
2. మానవులలో ఏ నామమున – రక్షణ కలుగదు నీకు
నీ ఆత్మ రక్షణ కొరకై – ఎవ్వరు ప్రాణ మియ్యలేదే! ॥దే॥
3. పాపపు శుద్ది మరి పాపక్షమ – ప్రభు యేసునందే దొరుకున్
సిలువలో రక్తము కార్చి – రక్షణ సిద్ధము చేసెన్ ॥దే॥
4. నీ పాపముల నొప్పుకొన్నచో – నమ్మకమైన దేవుండే
నీ పాపముల క్షమియించి – కడుగును కలుషములన్ని ॥దే॥
5. ఈ మంచివార్తను వినిపించుము – ఈ లోకమంతయు నేడే
రక్షణకర్త క్రీస్తేసే – అంగీకరించుడి నేడే ॥దే॥