ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. కీర్తన 136:13
1. దాస్య జనులనెల్ల మోషే విడిపించెను (1)
ప్రభువు దారి నీడ నిచ్చి రోజు కాచెను (1)
పరమ మన్నా వస్త్రమిచ్చి ఆదరించెను (1)
మోషే సాగరం చేరెను (2)
2. ఎట్లు మోషే సాగరమును దాటివెళ్లెను (3)
ఎవ్విధముగ దాటెను (2)
3. ఈతతో-కాదు, పడవలో-కాదు, ఎగిరెనా? కాదు కాదు (1)
నడచెనా-కాదు, పరుగునా-కాదు, ఏలాగు దాటెను? (1)
దేవుడే రేపెను గుఫ్, గుఫ్, గుఫ్ – పెనుగాలిచే అఫ్, అఫ్, అఫ్ (1)
సాగరంబు నందు దారిచేసెను – ఈలాగు మోషే దాటెను (1)
4. పిశాచి వశము నుండి యేసు విడిపించెను (1)
కీడులెన్నో రేగి నన్ను ఆవరించినన్ (1)
మోషే కేర్పరచినట్టి దేవుడే నాకున్ (1)
దారి చూపి నన్ను నడుపును (2)