జీవిత నావలో నే సాగెదన్
ప్రార్ధనతోనే పయనించెదన్
1. ఎస్తేరువలెనే నిన్ను విడువక
హన్నావలె నీకై వేచియుందును
ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్
యేసుతో కలసి నే సాగెదన్
2. నా చిన్న దోనెను యేసుకిత్తును
నా యేసు నేను కలసి పయనింతుము
ప్రార్ధించెదన్ ప్రార్ధించెదన్
యేసుతో కలసి నే సాగెదన్