చిన్న పిల్లలారా
చివరి సమయమిదేరా
యేసు వచ్చు వేళరా
ఎదురు చుద్దాంరా
1. యేసయ్యను నమ్మండి
యేసయ్యలో ఉండండి
యేసులోనే ఎదగండి
యేసుతోనే నడవండి
2. గురుతులెన్నో చెప్పాడు
షరతులెన్నో ఇచ్చాడు
మరువద్దని అన్నాడు
మన యేసు దేవుడు
3. క్రీస్తువలె ఉంటాడు
క్రీస్తు విరోధి వస్తాడు
క్రీస్తులానే చేస్తాడు
క్రీస్తు అతడు కాడు