నేను నీకు జీవకిరీటమిచ్చెదను. ప్రకటన 2:10
పల్లవి : చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి(2)
చాలా దూరం పోతుంది ఎంతో అద్భుత బండి అది (2)॥చిన్న॥
1. ఇంజన్, గుఱ్ఱం లేనిది – రెండు కాళ్లతో పోతుంది
చాలా దూరం పోతుంది – ఎంతో అద్భుత బండి అది (2) ॥చిన్న॥
2. మోక్షం నరకం అనెడి – రెండే స్టేషన్లు కలవు
బైబిల్ చూపుచున్నది – మోక్షం వెళ్లే మార్గమును ॥చిన్న॥
3. ఒక్కే ఒక్క టికెట్టు – క్రీస్తు నందు విశ్వాసం
బలి, పుణ్యం లేనిది – యేసు యొక్క కృపయే ॥చిన్న॥
4. యేసు బండిని నడపనిచో – బండి క్రిందికి పడుతుంది
మరణపు గంట మ్రోగగనే – బండి నిలిచిపోతుంది ॥చిన్న॥
5. వీణా, జండా, కిరీటం – మోక్షమందు దొరుకును
ప్రభుక్రీస్తుకే జయము – స్తుతించుట మన విధి ॥చిన్న॥