నేను గొట్టెలకు మంచి కాపరిని:… యోహాను 10:11
పల్లవి : చిన్న గొట్టెపిల్లను నీ మందలో – యేసు మంచి కాపరివి నీవే (2)
నేను నీ గొట్టెను నీవు నా కాపరి (2) శాశ్వతము ఈ బంధము (2)
1. ఉత్తమ మిత్రుడవు నీవే – నాకు సమస్తమును నీవే (2)
శాంతి ఆనందముల ఊటవు నీవే (2) నాకు క్షేమాధారము నీవే (2) ||చి||
2. నాదు శ్రేష్ట భాగము నీవే – నాదు దీవెనల ఊటవు (2)
కృపా క్షేమములకు మూలము నీవే (2) నాదు జీవన గీతము నీవే (2) ||చి||
3. నాదు మంచి కాపరివి నీవే – నాదు ఆశ్రయమును నీవే (2)
నాదు రక్షణకు ఊటవు నీవే (2) నాదు ఉన్నత దుర్గము నీవే (2) ||చి||