చిన్ని చిన్ని పిల్లల్లారా మీరందరూ
దేవుని స్తుతింప రండి
ఆయన మేలులన్ మరవకను
మహిమపరచ రండి యేసుని
మహిమపరచ రండి.
1. భూమి కంటే ఆకాశము
ఎంతో ఉన్నతము
భయభక్తులుగల వారిపై
ఆయన కృప ఎంతో అధికం
2. మనము మంటి వారము
అడవి పువ్వులము
అయినను మన తండ్రి ఎంతో
జాలి చూపించును