చిన్నా చిన్న గొర్రెపిల్లను
యేసు ప్రియ బిడ్డను
సంతసముగా సాగిపోయెదన్
చెంత యేసు నాతో ఉండగా
1. ముండ్ల పొదలలో నేను నడచివెళ్ళినా
తోడేళ్ళ మధ్యలో సంచరించినా
తొట్రిల్లను నేను చింతించను
తోడుగా నా యేసు ఉండగా
2. పచ్చిక గల చోటికి నన్ను నడుపును
శాంత జలముతో
నన్ను తృప్తి పరచును
నా కాపరి నా ప్రియుడేసుడే
చిరకాలము నన్ను కాయును