చిన్నారి చుక్కలము
సిరిమల్లె పువ్వులము
చల్లనైన యేసయ్య ఒడిలో
చక్కగా కూర్చుందుము ॥చిన్నా॥
1. జీవముండెను యేసులో
జీవమే జీవపు వెలుగు
నీతి సూర్యుడు నిజమైన వెలుగు
నిన్ను నన్ను వెలిగించును ॥చిన్నా॥
2. చీకటి జీవితం వదిలెదము
వెలుగు బాటలో నడిచెదము
యేసే వెలుగని చాటెదము
వెలుగును అందరికి పంచెదము ॥చిన్నా॥