చిత్రా చిత్రాలవాడే మన యేసయ్యా
చాలా చిత్రాలవాడే మన యేసయ్యా
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో
1. రాయి రప్ప మొక్కవద్దు
చెట్టు పుట్ట కొలవవొద్దు (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో ॥చిత్రా॥
2. లోకానికి వచ్చినాడు
పాపుల రక్షించినాడు .
పరిశుద్ధుడొచ్చినాడు
ఆ పరమును తెచ్చినాడు ॥చిత్రా॥