చిట్టి పొట్టి అమ్మడు
చిన్నారి తమ్ముడు
అందమైన బాట రా
మన దేవుని మాటరా
1. అందమైన తోటలో
కుందేలెన్నో ఉన్నవి
అందులోన దుడుకుది
తుంటరియైయున్నది
అమ్మ తనను బావి కడకు
వెళ్ళ వద్దు అన్నది
అమ్మ మాట వినక వెళ్ళి
బావిలోన పడ్డది
మంచి మాట వినకుంటే
ముప్పు పొంచి ఉంటది
మాట వినని దూతలకే
నరక శిక్ష పడ్డది
2. ఆదిలోన దేవుడు
ఆదాము హవ్వలను
ఆత్మ శరీరాలతో
తనను పోలిచేసెను
కీడు చేయు చెట్టు పండు
తినవద్దని అన్నారు
సాతాను మాట విని
వారు పండు తిన్నారు
ఆ పాప ఫలితమే
మరణము ప్రాప్తించెను
అదే జన్మ పాపము
వారసత్వ శాపము