ఎంతో ఎంతో ఎంతో సంతోషం
యేసయ్య మాట వింటే సంతోషం
ఎంతో ఎంతో ఎంతో ఆనందం
యేసయ్య ఉంటే ఆనందం
1. నా బాధలన్ని బాపును యేసు
నా చింతలన్ని తీర్చును యేసు
ప్రార్ధన ఆలకించి
అన్నీ అనుగ్రహిస్తాడు
2. తన మార్గము చూపించును యేసు
తన బాటలో నడిపించును యేసు
యేసయ్య మనకు తోడుగా ఉంటే
ఎంతో సంతోషం