…అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను. 2 రాజులు 5:14
పల్లవి : సిరియా దేశపు సైన్యాధి పతి శూరుడు నయమాను (2)
అయినను అతడో కుష్టరోగి, అదియే విచారం (1)
అతనికి అదియే విచారం(1)
1.ఎన్నో మందులు తిన్నాడు – ఎన్నో పూజలు చేశాడు
అయినను రోగము తగ్గకపోయెను – అదియే విచారం (1)
అతనికి అదియే విచారం (1) ॥సిరియా॥
2. ఇశ్రాయేలు చిన్నది చెప్పిన – సువార్త విన్నాడు (1)
అతడు సువార్త విన్నాడు (1)
ఎలీషా యొద్దకు వేగమే వెళ్ళి విన్నతి చేశాడు
అతడు విన్నతి చేశాడు (1) ॥సిరియా॥
3. యోర్దాను నదిలో ఏడుమార్లు ఎంచి మునిగాడు
అతడు ఎంచి మునిగాడు
శుద్ధుడై పరిశుద్ధ దేవుని మహిమపరచాడు
అతడు మహిమపరచాడు ॥సిరియా॥
4. ఆలాగే ఈ పాపమనెడి పాడురోగంబే
అది పాడురోగంబే
యేసు రక్తములో కడుగబడినచో శుద్ధులయ్యెదరు
ఆహా శుద్ధులయ్యేదరు ॥సిరియా॥