విత్తనాలు మూటకట్టి
ఎడ్లబండి మీద పెట్టి
విత్తనాలు విత్తుటకు బయలుదేరే ఛల్
విత్తనాలు విత్తుటకు బయలుదేరే
పొలములోన విత్తనాలు విత్తబోయే ఛల్
పొలములోన విత్తనాలు విత్తబోయే
యేసయ్య మాటలు బల్ బల్ బల్
అద్భుత సత్యం ఛల్ ఛల్ ఛల్
బల్ బల్ బల్ ఛల్ ఛల్ ఛల్
1. గంపలోన విత్తనాలు
చేతిలోకి తీసుకొని
పొలములోన విత్తనాలు వెదజల్లె
దారిపక్క విత్తనాలు కొన్ని పడితే
పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళెనే దేఖో
2 గంపలోన విత్తనాలు
చేతిలోకి తీసుకొని
పొలములోన విత్తనాలు వెదజల్లె
మంచినేల విత్తనాలు కొన్ని పడితే
నూరంతలూ పంట చేతికొచ్చె దేఖో.