యేసయ్య మాట జీవపు ఊట
పరముకు నడిపించు బాట
1. కత్తివలె ఖండిరచును
సుత్తివలె సరిచేయును
విలువైనది బలమైనది
నా యేసు నీ నోటిమాట
2. దీపంవలె వెలిగించును
అద్దంవలె సరిచేయును
విలువైనది బలమైనది
నా యేసు నీ నోటిమాట
3. తేనెవలె మధురము
నూనె శ్రేష్ఠము
విలువైనది బలమైనది
నా యేసు నీ నోటిమాట