newjerusalemministries.com

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

భయము లేదు మనకు
ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు (2)
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని          ||భయము||

సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2)
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2)           ||ఫలిత||

మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2)
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా (2)           ||ఫలిత||

కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము (2)
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి (2)           ||ఫలిత||

ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు (2)
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు (2)           ||ఫలిత||

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Bhayamu Ledu Manaku
Ikapai Eduru Vachchu Gelupu
Adigo Yesu Pilupu
Vinumaa Paramu Cheru Varaku (2)
Phalithamedaina Prabhunu Veedaku
Kashtamenthaina Kalatha Chendaku
Alupu Lekunda Parugu Saagani
Shodhanalu Ninnu Choosi Bedarani           ||Bhayamu||

Sandhinchina Baanamalle Nee Guri Konasaagani
Mana Thandri Vaagdhaanale Oopirigaa Maarani (2)
Kashtaale Metlugaa Maari Yesulo Ediginchani
Thana Vaakyam Neelo Veligi Cheekati Tholaginchani (2)        ||Phalitha||

Mandinche Aggithone Merayunu Bangaaramu
Shodhanala Kolimilone Balapadu Vishwaasamu (2)
Nee Tharapuna Yuddham Chese Yehovaa Nee Anda
Tholagipoku Aa Maargaanni Thana Aagnanau Vinakundaa (2)        ||Phalitha||

Kanaledaa Siluvalona Yesu Raaju Kashtamu
Thaanondina Shramala Dwaaraa Nashiyinche Paapamu (2)
Nee Shramala Kaalamlone Manasu Drudamu Kaavali
Thirigi Neelo Putte Paapam Beejamu Nashiyinchaali (2)        ||Phalitha||

Priyamaina Puthruni Manaki Naliginchina Devudu
Appaginchaledaa Sakalam Sarva Shakthimanthudu (2)
Thana Sannidhi Raavaalantu Ninnu Koruthunnaadu
Neethi Neelo Penchetanduku Thapana Paduthu Unnaadu (2)        ||Phalitha||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *