బలమైనది స్థిరమైనది దేవుని హస్తం
బాలలను దీవించిన దక్షిణ హస్తం
కొలత లేని కలత లేని ప్రభుని హస్తం
ముడత లేని మచ్చ లేని యేసుని హస్తం
మట్టిని మనిషిగా మలచిన హస్తం
దైవ రూపం పెట్టిన హస్తం
సూర్యచంద్ర సంద్రాలను ఆపిన హస్తం
సృష్టిక్రమం నిర్వహించే దేవునిహస్తం