…స్తోత్రరూపమగు క్రొత్తగీతమును… దేవుడు నా నోట నుంచెను. కీర్తన 40:3
పల్లవి : నా నోటన్ క్రొత్తపాట – నా యేసు ఇచ్చెను (2)
ఆనందముతో హర్షించి పాడెదన్ – జీవించు కాలమంతయు (1)
అ.ప.: హల్లెలూయా – ఆనందముతో హర్షించి పాడెదన్
జీవించు కాలమంతయు (1) ॥నా॥
1. అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆదరించును (2) ॥ఆనందము॥
2. వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెన్ ॥ఆనందము॥
3. దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ధిచేసెను ॥ఆనందము॥
4. నాకు తల్లి తండ్రి మరియు మిత్రుడాయనే
నిందనోర్చి ఆయనను ప్రకటింతును ॥ఆనందము॥
5. భువిలోని బాధలు నన్నేమి చేయును?
పరలోక వాసముకై వేచియున్నాను ॥ఆనందము॥