1థెస్సలోని 5: 14-15
14 “సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా- అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనియ్యడి. అందరియెడల దీర్ఘ శాంతము గలవారై యుండుడి.” 15 ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి; మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడల ఎల్లప్పుడును మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి.
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు నిశ్చలత్వమును, నిర్బయమును, నిగూఢయైన దైవిక క్రమమును, నిరంతరమైన ధైర్యమును, నిలకడైన ఆత్మీయతను పంచగలదని ప్రగాఢమైన విశ్వాసముతో….. మరియు ధనదాహముతో కాక నిస్వార్ధమైన ఆత్మలదాహముతో కొనసాగే ఈ నిబంధన పరిచర్యలో మీరు నిజమైన పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము.
మీకొరకు ప్రార్ధించే మీ సంఘం, మీ దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరచిపోవద్దు.