తూర్పున, పడమర – ఉత్తర దక్షిణము(సీయోను పిల్లల పాటలు)/ Thurpuna, Padamara -Uttara Dakshinamu
తెల్లారింది వేళ త్వరగా నిద్దుర లేదా /Thellarindi Vela Thwaragaa Niddura Leda
తెల్లారింది వేళ త్వరగా నిద్దుర లేదా మనమంతా ఆయన సృష్టేరా పక్షుల కోలాహ వేళ ప్రభువును స్తుతించవేరా వాటికంటే శ్రేష్టులు మనమేరా 1. అడవిరాజు సింహమైనను ఆకలంటు పిల్లల్లన్నను యేసు రాజు పిల్లలం మనం పస్తులుంచునా వాడిపోవు అడవి పూలకు రంగులేసి అందమిచ్చెను రక్తమిచ్చి కొన్న మనలను మరచిపోవునా 2. చిన్నదైన పిచ్చుకైనను చింతవుందా మచ్చుకైనను విత్తలేదు కోయలేదని కృంగిపోవునా వాటికన్ని కూర్చువాడు నీ తండ్రి యేసేనని నీకు ఏమి తక్కువ కాదని నీకు తెలియునా
తొందరపడకే చిన్ని హృదయమా / Thondara Padake Chinni Hrudayamaa
తొందరపడకే చిన్ని హృదయమా ధైర్యము వీడక నిలిచియుండుమా 1. నీకు కలుగు కష్టములో దేవునితోడు ఉండునులే మహిమ గలిగిన క్రీస్తే నిన్ను చిటికెలో విడిపించునులే 2. చిక్కు తెచ్చు సమస్యలలో దేవుడు నీ వెంటుండునులే జ్ఞానియైన యేసే నీకు జవాబును చూపించునులే
తల్లి మరచినా తండ్రి విడచినా / Thalli Marachina Thandri Marachina
తల్లి మరచినా తండ్రి విడచినా నిన్ను నేను విడువను ఎడబాయను అనెను నాదు కాపరి యేసు నా గురి 1 కష్టమొచ్చినా నష్టమొచ్చినా ॥నిన్ను॥ 2 వ్యాధి కలిగినా బాధ కలిగినా ॥నిన్ను॥