newjerusalemministries.com

జాబిల్లి కంటే చల్లనా / Jaabilli Kante Challana

జాబిల్లి కంటే చల్లనా నా యేసు ప్రేమ ఆ మంచు కంటే తెల్లనా.. నా యేసు ప్రేమ అమ్మ కంటే చక్కన తేనె కంటే తియ్యన నా యేసు ప్రేమ (4) 1. సంపంగి కంటే సువాసన నా యేసు ప్రేమ శరాత్ర కంటే సుభావన నా యేసు ప్రేమ చెలిమి కంటే తియ్యన కలిమి కంటే చక్కన నా యేసు ప్రేమ (4)

జీవిత నావలో నే సాగెదన్‌ / Jeevitha Naavalo Nee Saagedan

జీవిత నావలో నే సాగెదన్‌ ప్రార్ధనతోనే పయనించెదన్‌ 1. ఎస్తేరువలెనే నిన్ను విడువక హన్నావలె నీకై వేచియుందును ప్రార్ధించెదన్‌ ప్రార్ధించెదన్‌ యేసుతో కలసి నే సాగెదన్‌  2. నా చిన్న దోనెను యేసుకిత్తును నా యేసు నేను కలసి పయనింతుము ప్రార్ధించెదన్‌ ప్రార్ధించెదన్‌ యేసుతో కలసి నే సాగెదన్‌

జీవముగలవాడు నా దేవుడు / Jeevamugala Vaadu Naa Devudu

జీవముగలవాడు నా దేవుడు జీవించుచున్నవాడు 1. గుడ్డివాడు కాడు నా దేవుడు నా క్రియలన్‌ చూచును చెవిటివాడు కాడు నా దేవుడు నా మొర వినుచుండును ॥జీవ॥ 2. మూగవాడుకాడు నా దేవుడు నాతో మాట్లాడును కురుచకాదు మరి ఆయన హస్తము నన్నిల రక్షించు 3. మనుషులు చేసిన వట్టి విగ్రహం కాదు నా దేవుడు ఆత్మ రూపిగ మాతో నుండి మమ్మును కాపాడును

జోకర్‌ బాబాయ్‌ జోకర్‌ బాబాయ్‌ / Joker Babai Joker Babai

జోకర్‌ బాబాయ్‌ జోకర్‌ బాబాయ్‌ రావ రావ రావ మేము ఎదురు చూస్తు వున్నాం నీ మైండు షార్పుగుంది నీ డ్రస్సు మస్తుగుంది మనమంతా ప్రభునివారం అల్లరి చెయ్యం ఫైటు చెయ్యం హే… హే… హే… హే… హే..