యేసుతో నడచి వెళ్ళెదం
అన్ని తావులలో
యేసుతో కూడ నుండెదం
అన్ని వేళలలో
1. రూపాంతర కొండనెక్కెదం
యేసుప్రభుని మహిమ చూచెదం
తండ్రి స్వరము చెవినబెట్టిదం
ఆనందం అనుభవించెదం
2. కల్వరిగిరి పైకి వెళ్ళేదం
యేసుని అనుసరించి సాగెదం
సిలువ శ్రమలో పాలుపొందెదం
భయపడక నిలిచియుండెదం