హైలెస్సో ఎలో ఎలో హైలెస్స
నా చిన్ని నావలో నా
చిన్నారి నావలో
యేసయ్యకు చోటు ఉన్నది
నా యేసయ్యకు చోటు ఉన్నది
హైలెస్సో ఎలో ఎలో హైలెస్స
1. గాలి తుఫానులు ఎదురు వచ్చినా
తూలి నేనొక్కమారు పడబోయిన
నా యేసు అది చూచి తన చేయినే చాచి
కాపాడుకుంటాడుగా
2. అలలేచి నావపై పడబోయిన
పిలిచేందుకు నోట మాట రాకున్నను
నా యేసు నను చూచి తన శక్తినే వీచి
రక్షించుకుంటాడుగా
3 దరి చేరే దారి ముందు కానకున్నను
దిక్కులన్ని చిక్కనైన చీకటైనను
నా యేసు తన వెలుగును
నా దారిలో పరచి
దరి చేర్చనున్నాడుగా