శక్తిగల యేసుక్రీస్తు నామంలో
జయము పొందుతాను నేను అన్నిటిలో
అ.ప: యేసులో నిలిస్తే గొప్పజయం
యేసుతో నడిస్తే లేదు భయం ॥శక్తి॥
1. బలశాలి గొల్యాతును చిన్న రాయితో
పడగొట్టెను దావీదు దైవబలముతో
దేవునిపై ఉంచెదను విశ్వాసం
దేవుని కర్పించెదను నా జీవితం ॥యేసు॥
2. లెక్కలేని శత్రువులను కొద్దిమందితో
గెలిచినాడు యెహోషువ ప్రార్ధనాత్మతో
ప్రార్ధనతో గెలిచెదను సమస్తం
లోకంలో నిలిచెదను ప్రభుకోసం ॥యేసు॥