రారండి చిన్న పిల్లలారా
మన ప్రియ యేసుతో మాట్లాడను
కలసి రండీ (2)
మన ప్రియ యేసుతో మాట్లాడను
1. ప్రేమతో యేసు పిలచుచుండే
వాద్యములతో పాడుచు వెళ్ళెదం
2. బైబిలు యేసునకు ప్రియము
బాగుగా దానిని వినెదము
3. అన్న వస్త్రములను మాత పిత
సోదరి సోదరులనిచ్చెన్
4. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై
చూడుము ఎన్నో దీవెనలు