యేసన్న నిన్ను పిలచుచున్నాడు
హోసన్న పాటలు పాడు నేడు
లెమ్ము విడచి రమ్ము
నమ్ము హృదయమిమ్ము
యేసుని చేరుకొమ్ము
1. యెరికోలో గ్రుడ్డి వాడు
త్రోవ ప్రక్కనుండినాడు
కరుణకై వేడినాడు
తీమయి కుమారుడు ॥యేస॥
2. పిలిచెను తన దాసులుగా
నింపెను వాక్యము నోట
మలిచెను తన పాత్రలుగా
పంపెను శుభవార్త చాట ॥యేస॥