క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు… 2 తిమోతి 2:3
పల్లవి: యుద్ధవీరులం జై యుద్ధవీరులం
క్రీస్తు యేసు యొక్క మంచి రాణువ వారం
1. దేవుడిచ్చే సర్వాంగ కవచము తొడిగి
శత్రు సైతానును – తరిమి వేసెదం(2)
ప్రభుయేసు క్రీస్తులో – బలవంతులమై
పోరాడెదం మంచి పోరాటము(2) ॥యుద్ధ॥
2. అపవాది యొక్క – అగ్ని బాణములను
విశ్వాసపు డాలుతో – ఆర్పివేసెదం(2)
సిలువ జెండ నెత్తి – సర్వలోకమునకు
చాటెదము యేసే – మార్గమని(2) ॥యుద్ధ॥
3. క్రీస్తేసు యోధులుగ – పోరాడుచూ
అర్పించెదం మన – జీవితముల్(2)
గురిచేరువరకు – పరుగెత్తుచూ
పోరాడి పొందెదం – నీతికిరీటం(2) ॥యుద్ధ॥