పాట రచయిత: మిక్కిలి సమూయేలు
Lyricist: Mikkili Samooyelu
మనస యేసు మరణ బాధ – లెనసి పడవే
తన – నెనరు జూడవే యా – ఘనుని గూడవే
నిను – మనుప జచ్చుటరసియే – మరక వేడవే ||మనస||
అచ్చి పాపములను బాప – వచ్చినాడట
వా-క్కిచ్చి తండ్రితో నా – గెత్సేమందున
తా – జొచ్చి యెదను నొచ్చి బాధ – హెచ్చుగనెనట ||మనస||
ఆ నిశీధ రాత్రి వేళ – నార్భటించుచు
న-య్యో నరాంతకుల్ చే-బూని యీటెలన్
ఒక – ఖూని వానివలెను గట్టి – కొంచుబోయిరా ||మనస||
పట్టి దొంగవలెను గంత – గట్టి కన్నులన్
మరి – గొట్టి చెంపలన్ వడి – దిట్టి నవ్వుచున్
నిను – గొట్టి రెవ్వరదియు మాకు – జెప్పమనిరట ||మనస||
ముళ్ల తోడ నొక కిరీట – మల్లి ప్రభు తలన్
బెట్టి – రెల్లు కర్రతో నా – కళ్ళ జనములు
రా-జిల్లు మనుచు గొట్టి నవ్వి – గొల్లు బెట్టిరా ||మనస||
మొయ్యలేక సిల్వ భారము – మూర్చ బోయెనా
అ-య్యయ్యో జొక్కెనా యే-సయ్య తూలెనా
మా – యయ్యనిన్ దలంపగుండె – లదరి పోయెనా ||మనస||
కాలు సేతులన్ గుదించి – కల్వరి గిరిపై
నిన్ – గేలి జేయుచు నీ – కాళ్ళ మీదను
నినుప – చీలలతో గృచ్చి నిన్ను – సిల్వ గొట్టిరా ||మనస||
దేవ సుతుడా వైతి వేని – తీవరంబుగా
దిగి – నీవు వేగమే రమ్ము – గావు మనుచును
ఇట్లు – గావరించి పల్కు పగర – కరుణ జూపెనా ||మనస||
తన్ను జంపు శత్రువులకు – దయను జూపెనా
తన – నెనరు జూపెనా ప్రభు – కనికరించెనా
ఓ – జనక యీ జనుల క్షమించు – మనుచు వేడెనా ||మనస||
తాళలేని బాధ లీచ్చి – దాహమాయెనా
న-న్నేలువానికి నా – పాలి స్వామికి
నే-నేల పాపములను జేసి – హింస పరచితి ||మనస||
గోడు బుచ్చి సిలువపైన – నేడు మారులు
మా-ట్లాడి ప్రేమతో నా – నాడు శిరమును
వంచి – నేడు ముగిసె సర్వ మనుచు – వీడె ప్రాణము ||మనస||
మరణమైన ప్రభుని జూచి – ధరణి వణకెనా
బల్ – గిరులు బగిలెనా – గుడి తెరయు జీలెనా
దివా-కరుడు చీకటాయె మృతులు – తిరిగి లేచిరి ||మనస||
ఇంత జాలి యింత ప్రేమ – యింత శాంతమా
నీ – యంత కరుణను నే – జింత చేయగా
నీ – వింత లెల్ల నిత్య జీవ – విధము లాయెనా ||మనస||
పాట రచయిత: మిక్కిలి సమూయేలు
Lyricist: Mikkili Samooyelu
Manasa Yesu Marana Baadha – Lenasi Padave
Thana – Nenaru Joodave Yaa – Ghanuni Goodave
Ninu – Manupa Jachchutarasiye – Maraka Vedave ||Manasa||
Achchi Paapamulanu Baapa – Vachchinaadata
Vaa-kkichchi Thandritho Naa – Gethsemanduna
Thaa – Jochchi Yedanu Nochchi Baadha – Hechchuganenata ||Manasa||
Aa Nisheedha Raathri Vela – Naarbhatinchuchu
Na-yyo Naraanthakul Che-booni Yeetelan
Oka – Khooni Vaanivalenu Gatti – Konchuboyiraa ||Manasa||
Patti Dongavalenu Gantha – Gatti Kannulan
Mari – Gotti Chempalan Vadi – Ditti Navvuchun
Ninu – Gotti Revvaradiyu Maaku – Jeppamanirata ||Manasa||
Mulla Thoda Noka Kireeta – Malli Prabhu Thalan
Betti – Rellu Karratho Naa – Kalla Janamulu
Raa-jillu Manuchu Gotti Navvi – Gollu Bettiraa ||Manasa||
Moyyaleka Silva Bhaaramu – Moorcha Boyenaa
A-yyayyo Jokkenaa Ye-sayya Thoolenaa
Maa – Yayyanin Dalampagunde – Ladari Poyenaa ||Manasa||
Kaalu Sethulan Gudinchi – Kalvari Giripai
Nin- Geli Jeyuchu Nee – Kaalla Meedanu
Ninupa – Cheelalatho Gruchchi Ninnu – Silva Gottiraa ||Manasa||
Deva Suthuda Vaithi Veni – Theevarambugaa
Digi – Neevu Vegame Rammu – Gaavu Manuchunu
Itlu – Gaavarinchi Palku Pagara – Karuna Joopenaa ||Manasa||
Thannu Jampu Shathruvulaku – Dayanu Joopenaa
Thana – Nenaru Joopenaa Prabhu – Kanikarinchenaa
O – Janaka Yee Janula Kshaminchu – Manuchu Vedenaa ||Manasa||
Thaalaleni Baadha Lechchi – Daahamaayenaa
Na-nneluvaaniki Naa – Paali Swaamiki
Ne-nela Paapamulanu Jesi – Himsa Parachithi ||Manasa||
Godu Buchchi Siluvapaina – Nedu Maarulu
Maa-tlaadi Prematho Naa – Naadu Shiramunu
Vanchi – Nedu Mugise Sarva Manuchu – Veede Praanamu ||Manasa||
Maranamaina Prabhuni Joochi – Dharani Vanakenaa
Bal – Girulu Bagilenaa – Gudi Therayu Jeelenaa
Divaa-karudu Cheekataaye Mruthulu – Thirigi lechiri ||Manasa||
Intha Jaali Yintha Prema – Yintha Shaanthamaa
Nee – Yantha Karunanu Ne – Jintha Cheyagaa
Nee – Vintha Lella Nithya Jeeva – Vidhamu Laayenaa ||Manasa||