నేను నిజమైన ద్రాక్షావల్లిని…. యోహాను 15:1
1. ప్రభుయేసే నిజ ద్రాక్షావల్లి – ఆయనలో నేనొక తీగెను (2)
ఆయనకు వేరుగా నేను – ఏమియు చేయలేను (2)
పనికిరాని వన్నిటిని – తీసివేయనిచ్చెదను (2)
అధికముగా ఫలించెదను – తండ్రికి మహిమ కలుగుటకె (2) ॥ప్రభు॥
2. ఆత్మలో ఆనందించుచు – ఫలియించెదనే నీ ఫలమున్
ప్రేమ సంతోషము సమాధానం – దీర్ఘశాంత దయాళుత్వము
మంచితనము విశ్వాసము – సాత్వికము ఆశానిగ్రహమున్ ॥ప్రభు॥
3. ప్రభువునకు తగినట్లుగా – నడిచెదను ప్రతి విషయములో
మారు మనస్సుకు తగినట్లుగా – అత్యధికముగా ఫలియించెదను ప్రభువు కృపలో ఎదిగెదను – ప్రభు రాకను నిరీక్షించుచు ॥ప్రభు॥