…నీ రాజ్యము వచ్చుగాక,… మత్తయి 6:10
పల్లవి : నీ నామమే స్తుతినొందు గాక (1)
నీ రాజ్యమే ఏతెంచు గాక (1)
నీ చిత్తమే సిద్ధించు గాక (1)
యేసు ప్రభు యుగయుగముల వరకు (1)
హల్లెలూయ – ఆమేన్ ఆమేన్ (2)
1.సర్వాధికారియు – సర్వ శక్తి గల్గినది (2)
సకల పాప విమోచన నీ నామమే
2. న్యాయానికి స్థానము – ప్రేమకు మూలము
పరిశుద్ధంబైనది నీ రాజ్యమే
3. ఏనాడు మారనిది ఏ హాని చేయనిది
ఎల్లరికి క్షేమమిచ్చు నీ చిత్తమే