నీ చేతులతో నను చేసితివి
నీ చేతులలోనే నను చెక్కితివి
నీ చేతులతో నన్నెత్తుకొంటివి (2)
చేతులుంచి దీవించి ఆదరించితివి
చేతులెత్తి నిన్నే స్తుతియింతును
చేతులెత్తి యేసయ్య ప్రార్ధింతును
1. స్వస్థపరచిన నీ మహిమ చేతులు
సమృద్ధినిచ్చిన అద్భుత చేతులు
సాయపడిన గాయాల రక్త చేతులు
సిలువలో చాచి పిలిచే ప్రేమ చేతులు
చేతులెత్తి నిన్నే స్తుతియింతును
చేతులెత్తి యేసయ్య ప్రార్ధింతును