నీవు వెళ్ళుము
సమరయునివలె చేయుము
కరుణను జాలిని చూపించుము
క్రీస్తు ప్రేమను పంచుము ॥నీవు॥
1. యెరికో వైపు చూడకు
యెరూషలేమును వీడకు
దుష్టుల సభలో చేరకు
దేవుని ఆజ్ఞను మీరకు
2. పాపపు గాయాలతోనున్న
ప్రాణాపాయములోనున్న
సాయము చేయుటయే మిన్న అని ప్రబోధించే మన యేసన్న