నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. కీర్తన 51:2
పల్లవి : నా హృదయము యేసుని తోట – దాని ఫలితము నే నిత్తును (2)
నే ప్రేమతో సేవను చేతును – ప్రేమ మాటలు పలికెదను (2)
1. నా హృదయపు తోట కడుగుము – ఓ ప్రేమగల యేసు (2)
గురుగులు, రాళ్లు, ముళ్లును – తీసివేయుము నానుండి (2) ॥నా॥
2. నా హృదయపు తోటలోనికి రా – ఓ ప్రేమగల యేసు (2)
నీ తోటగ చేసికొనుము – యజమానుడవు కమ్ము (2) ॥నా॥