నా ధ్యానము గానము ప్రాణము యేసే
నా ప్రార్ధన ఆరాధాన సమర్పణ దేవునికే
ధ్యానింతును వాక్యము దివారాత్రము
జీవింతును యేసుతోనే చిరకాలము
1. మర్మము దేవుని వాక్యము
నిర్మలము క్షేమాధారము
ఆనంద ప్రవాహము జీవము
అది ఆహారము జీవనాధారము
2. దేవుని స్వరమే ఆ వాక్యము
దైవస్వరూప వాక్య దర్శనము
మదిలోన మంటలు రేగెను
మండెదను యేసుని ప్రకటింతును