క్రీస్తుయేసుయొక్క మంచి సైనికుడు … 2 తిమోతి 2:3
పల్లవి : చిన్న పిల్లలారా రారండి – క్రీస్తు సైన్యములో చేరండి(2)
మంచి రాణువ వాని వలె పోరాడిన(2)జీవ కిరీటమిచ్చును యేసు(2)
1.స్తెఫను జీవితము – మాదిరి పెట్టుకొనుడి(2)
చావునకైనను సమ్మతించి – పోరాడుడి జగమున (2) ॥చిన్న॥
2. పౌలు జీవితము – గురిగ పెట్టుకొనుడి
క్రీస్తును కలిగి నడిచినట్లు – మీరు నడువుడి జగమున ॥చిన్న॥
3. తిమోతి జీవితము – సరిగ గమనించుడి
క్రీస్తును కలిగి నడిచినట్లు – మీరు నడువుడి జగమున ॥చిన్న॥