newjerusalemministries.com

…ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని… చింతింపకుడి;… మత్తయి 6:25

1. చిన్న చిన్న పిల్లలారా – యేసురాజు చెప్పెనుగా

    గగనము నెగిరే పక్షుల జూడుమా

    అవి విత్తవు మరి కోయవుగా – సమకూర్చవు కొట్టులలో

    వాటిని దేవుడు పోషించుచున్నాడు              (2)

    అల్పమైన పక్షులను – దేవుడిట్లు పోషించిన     (1)

    నిన్ను, నన్ను నిజముగా పోషించును            (1)

    అలాగైన ఆహారముకై – చింతించకు            (1)

    ఆధారమెవరని దుఃఖించక                        (1)

    పక్షులకంటే శ్రేష్ఠులమనె ప్రభువు                  (2)

2. చిన్న చిన్న పిల్లలారా – యేసురాజు చెప్పెనుగా

    పలు విధ అడవి పువ్వుల జూడుమా

    అవి వడకవు కష్టపడవు – మరి యేమియు చేయవు

    వాటిని దేవుడు అలంకరించెను                   (2)

    అల్పమైన పువ్వులనే దేవుడలంక రించిన       (1)

    నిన్ను నన్ను ధరింపజేయునుగా                  (1)

    అలాగైన వస్త్రంబులకై వాపోకుము               (1)

    రేపటి గూర్చి చింతించకు                          (1)

    పువ్వులకంటే శ్రేష్టులమనే ప్రభువు                (2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *