నేను గొఱ్ఱాలకు మంచి కాపరిని… యోహాను 10:11
1.చిన్న గొట్టెపిల్ల ఒకటి – గంతులేసి ఆడెను
మందవీడి మెల్లగా – వేరు ప్రక్క గెంతెను
బర్మని పరుగిడెన్ – దారి తప్పిపోయెను
రాత్రి సమయమాయెను – చలికి వణకిపోయెను
దారి తప్పిన తప్పు తలచి – వెక్కి వెక్కి
ఏడ్చెను గడగడ వణికెను – కన్నీరు కార్చెను.
2. గొట్టెల కాపరి కొండ లోయలో – నడచి నడచి చూచెను (1)
గొట్టెనతడు వెదకి వెదకి – ముండ్ల పొదలో కనుగొనెన్ (1)
భుజము మీద మోసెను – ఆనందముగ వెళ్ళెను. (1)
3. నిన్ను నన్ను ప్రేమించు – మంచి కాపరి యేసుడే (1)
ఆయన స్వరము వింటివా? – అదియు నీకు తెలియునా? (1)
యేసు వైపు తిరుగవా? – ఆశతోడ వత్తువా? (1)